ఏపీ సీఎం జగన్పై కోడి కత్తితో దాడి చేసిన కేసులో నిందితుడు శ్రీనివాస్ తల్లి సావిత్రి తాజాగా సీజేఐ ఎన్వి రమణకు లేఖ రాశారు. తన కుమారుడు నాలుగేళ్లుగా జైలులో రిమాండ్ ఖైదీగానే మగ్గుతున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
కోర్టులు కానీ, ఎన్ఐఏ కానీ విచారణ జరపడం లేదని చెప్పారు. ఇన్నేళ్లు విచారణ ముందుకు సాగకుండా నిర్బంధించిన తమ కుమారుడిని రిలీజ్ చేయించాలని లేఖలో కోరారు.