ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇక వారికి కూడా ఆ టీకా ఇవ్వవచ్చు: కేంద్ర గ్రీన్ సిగ్నల్

national |  Suryaa Desk  | Published : Sat, Jul 09, 2022, 02:34 PM

కరోనా వచ్చిన నాటి నుంచి పిల్లకోసం, పెద్దల కోసం వేర్వేరుగా టీకాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇదిలావుంటే 5 నుంచి 12 ఏళ్లలోపు చిన్నారుల కోసం బయోలాజికల్-ఇ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ కొర్బెవ్యాక్స్, భారత్ బయోటెక్ టీకా ‘కొవాగ్జిన్‌’ వినియోగానికి ‘ఎన్‌టాగి’ స్టాండింగ్ టెక్నికల్ సబ్ కమిటీ సిఫార్సు చేసింది. కొర్బెవ్యాక్స్‌ను 5-12 ఏళ్లలోపు పిల్లలకు వేయనుండగా, కొవాగ్జిన్‌ టీకా 6-12 ఏళ్ల మధ్య చిన్నారులకు ఉద్దేశించినది. 6 నుంచి 12 ఏళ్లలోపు చిన్నారులకు ఉపయోగించేందుకు భారత ఔషధ నియంత్రణ సంస్థ డీసీజీఐ భారత్ బయోటెక్‌కు ఏప్రిల్ 26న అనుమతి మంజూరు చేసింది. అదే నెలలో డీసీజీఐ నిపుణుల ప్యానెల్ 5 నుంచి 12 ఏళ్లలోపు చిన్నారులకు వేసేందుకు బయోలాజికల్-ఇ కొర్బెవ్యాక్స్‌కు అత్యవసర వినియోగ అనుమతిని మంజూరు చేయాలని సిఫార్సు చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com