సొంత పార్టీ నేతల అసమ్మతితో బ్రిటన్ ప్రధాని పదవికి బోరిస్ జాన్సన్ రాజీనామా చేశారు. ఈ సమయంలో బ్లాక్పూల్లోని టుస్సాడ్ మ్యూజియం సిబ్బంది ఆయన విగ్రహాన్ని తరలించే పనిలో నిమగ్నమయ్యారు. ఆయనపై ఉన్న ఆగ్రహాన్ని తెలిపేందుకు ఆ విగ్రహాన్ని మ్యూజియం నుండి ఓ జాబ్ సెంటర్ వెలుపలకు తరలించారు. పదవి కోల్పయిన బోరిస్ ఇక ఉద్యోగం వెతుక్కొవాల్సిందేన్నట్లుగా వెక్కిరిస్తూ బొమ్మను జాబ్ సెంటర్ వెలుపలకు మార్చారు.