వైసీపీ ప్లీనరీలో అధ్యక్షుడు, సీఎం జగన్ ప్రసంగించారు. తెలుగుదేశం పార్టీ పెత్తందార్ల పార్టీ అని, చంద్రబాబు సిద్దాంతం వెన్నుపోట్లు పొడవడమని జగన్ విమర్శించారు. చంద్రబాబుకు చిప్ కాళ్లు, చేతులలో ఉంటే సరిపోదని మెదడులో ఉండాలని ఆయన అన్నారు. నన్ను కనపడకుండా చేయాలని చేసిన పార్టీ నేడు నామరూపాల్లేకుండా పోయిందని కాంగ్రెస్ ను సీఎం జగన్ విమర్శించారు. ఆనాడు లొంగిపోయి ఉంటే నేడు మీ ముందు ఉండేవాన్ని కాదన్నారు