2021-22 ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.13 వేల కోట్ల విలువైన రక్షణోత్పత్తులు, సాంకేతికతలను విదేశాలకు సరఫరా చేయడం ద్వారా భారత్ సరికొత్త రికార్డును నమోదుచేసింది. అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే ఇది దాదాపు 54 శాతం ఎక్కువని రక్షణోత్పత్తుల విభాగం అదనపు కార్యదర్శి సంజయ్ జాజు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. అయిదేళ్ల క్రితంతో పోలిస్తే దాదాపు ఇది ఎనిమిది రెట్లు ఎక్కువ కావడం విశేషం.