వైసీపీ ప్లీనరీలో తాను పాల్గొనడంపై వస్తున్న విమర్శలపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం స్పందించారు. గుంటూరులో జరిగిన ప్లీనరలో శనివారం కీలక వ్యాఖ్యలు చేశారు. తాను స్పీకర్ అయినప్పటికీ, మొదటగా తాను వైసీపీ తరుపున ఎమ్మెల్యేగా గెలిచానన్నారు. ఈ విషయాన్ని విమర్శించే వారు గుర్తుంచుకోవాలన్నారు. తప్పు చేస్తున్నాననే భావన లేదని, వైసీపీ కార్యక్రమాలలో పాల్గొంటానని స్పష్టం చేశారు.