విదేశాల్లో గొప్ప చదువులు చదవాలని కలలు కన్న ఓ పేద విద్యార్థి పట్టుదలతో చదివి రూ. 2.5 కోట్ల స్కాలర్ షిప్ ను సంపాదించాడు. బిహార్ రాజధాని పట్నాకు చెందిన 17 ఏళ్ల ప్రేమ్ కుమార్ మెకానికల్ ఇంజినీరింగ్, అంతర్జాతీయ సంబంధాలపై ఉన్నత విద్య అవకాశాన్ని పొందాడు. దీని కోసం అమెరికాలోని లఫాయెట్టే కళాశాలలో ఈ విలువైన స్కాలర్ షిప్ కు ఎంపికయ్యాడు. ఈ మేరకు శుక్రవారం కళాశాల డీన్ మాథ్యూ హైడ్ లెటర్ పంపించారు.