జమ్మూకాశ్మీర్‌లోని బుడ్గామ్ ప్రాంత మహిళ ఇన్షా రసూల్‌కు వ్యవసాయం అంటే మక్కువ. దీని కోసం ఏకంగా పీహెచ్‌డీ కోర్సును మధ్యలోనే వదిలేసింది. సేంద్రియ వ్యవసాయంలో మెళకువలపై అధ్యయనం చేసింది. భర్త సహకారంతో తమకున్న 3.5 ఎకరాల్లో కూరగాయలు పండించడం మొదలు పెట్టింది. 'హోమ్‌గ్రీన్స్' పేరుతో తాను పండించిన కూరగాయలను సోషల్ మీడియా ద్వారా విక్రయిస్తుంది. లక్షల్లో లాభాలనూ ఆర్జిస్తోంది.