నాటుసారా తయారు చేసి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులు ను కొయ్యూరు ఎస్సై దాసరి. నాగేంద్ర అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. శరభన్నపాలెం సమీపంలోని నాటుసారా తయారీ బట్టిలపై దాడి చేసి గోవింద్, బాలరాజు, అనే ఇద్దరు వ్యక్తులు తో పాటు, వారి వద్ద 27 లీటర్ల సారా స్వాదీన పరచుకొని, వీరికి సారా తయారీ కి బెల్లం, అమూన్య, అంటి సామానులు అందించిన కిరాణా వ్యాపారి అబ్దుల్ రషీద్ ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు.
నాటుసారా తయారు చేసినా వారికి సహకరించినా చట్ట రీత్యా నేరమని, అలాంటి వారిపై కటిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు. ఈ దాడుల్లో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.