అనకాపల్లి జిల్లా, బుచ్చయ్యపేట మండలం, పెద్ద మదిన, చిన్న మదిన గ్రామ రెవెన్యూ పరిధి లలో కబ్జాకు గురైన ప్రభుత్వ భూములను, అప్పారావు బారి నుండి కాపాడాలని దళితులు గ్రామాల ప్రజలును కోరుతున్నారు. అలాగే పచ్చనేత అప్పారావు ఈ మధ్యకాలంలో వస్తున్న పత్రికా కథనాలకు భయపడేది లేదు అని, ఎవడు ఇక్కడకు వస్తాడు, ఏ అధికారులు వస్తారు అంటూ బహిరంగంగానే సవాల్ విసిరుతున్నారని గ్రామస్తులు తెలిపారు. అలాగే గ్రామస్తులు మాట్లాడుతూ, ఈ వ్యక్తిపై ఉన్నత స్థాయి రెవెన్యూ అధికారులు, రెవిన్యూ విజిలెన్స్ అధికారులు దృష్టి సారించి, ఈ వ్యక్తి నుండి ప్రభుత్వ భూములను కాపాడి, ప్రజాప్రయోజనాలకు ఉపయోగించాలని స్థానికులు కోరుతున్నారు.
అనకాపల్లి జిల్లా, బుచ్చయ్యపేట మండలం చిన్నమదీనా రెవిన్యూ లో వియ్యపు అప్పారావు కబ్జా చేసిన ప్రభుత్వ భూములు జాబితా.
సర్వేనెంబర్ 2/5లో 23, ఎకరాలు. గెడ్డ వాగు.
సర్వేనెంబర్ 3/1లో 15 ఎకరాలు. గెడ్డ వాగు.
సర్వేనెంబర్ 3/2లో 4 ఎకరాలు.
సర్వేనెంబర్ 3/3 లో 4 ఎకరాలు.
సర్వేనెంబర్ 4/1లో 3. 50 ఎకరాలు.
సర్వేనెంబర్ 4/2లో 2. 35 ఎకరాలు.
సర్వేనెంబర్ 4/3లో 4. 50 ఎకరాలు.
సర్వే నెంబర్ 5/లో 4. 50 ఎకరాలు.
సర్వేనెంబర్ 11లో 2 ఎకరాలు.
సర్వేనెంబర్ 14/1లో 4 ఎకరాలు.
సర్వేనెంబర్ 14/2లో 5 ఎకరాలు.
సర్వేనెంబర్ 14/3లో 4 ఎకరాలు.
సర్వేనెంబర్ 15లో 5. 88 ఎకరాలు.
సర్వేనెంబర్ 12 లో 3. 38 ఎకరాలు.
అనకాపల్లి జిల్లా, బుచ్చయ్యపేట మండలం పెద్ద మదిన గ్రామ రెవిన్యూ లో అప్పారావు కబ్జా చేసిన ప్రభుత్వ భూములు జాబితా. సర్వేనెంబర్ 81లో కొండ పోరంబోకు 40 ఎకరాలు
సర్వేనెంబర్ 81లో -20 ఎకరాలు ప్రభుత్వం దళితులకు ఇచ్చిన భూములు
సర్వేనెంబర్ 207 లో 4. 20 ఎకరాలు
సర్వేనెంబర్ 177/2లో 3 ఎకరాలు