టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను అరుదైన రికార్డు ఊరిస్తోంది. కెప్టెన్‌గా ఇప్పటి వరకు వరుసగా 19 మ్యాచుల్లో రోహిత్ విజయం సాధించాడు. అందులో 14 విజయాలు టీ20లలోనే దక్కాయి. ఇక టీ20 సిరీస్‌ను 2-0తో దక్కించుకున్న టీమిండియా ఆఖరి మ్యాచ్‌ను నేడు ట్రెంట్‌బ్రిడ్జిలో ఇంగ్లాండ్‌తో ఆడనుంది. ఇందులోనూ గెలిస్తే పాంటింగ్ నెలకొల్పిన 20 విజయాల రికార్డును రోహిత్ సమం చేయనున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa