పుణెకి చెందిన సందర్శి యాదవ్(32) అనే వ్యక్తి ఇటీవల తన ప్రేయసితో విదేశాలకు వెళ్లాడు. అయితే భార్యకు మాత్రం ఇంటర్వ్యూ అని చెప్పాడు. ఆమెకు విషయం తెలిసిపోతుందనే భయంతో పాస్‌పోర్టులో పేజీలు చింపేశాడు. తిరిగి గురువారం రాత్రి ముంబైకు రాగా ఇమ్మిగ్రేషన్ అధికారులు అరెస్ట్ చేశారు. పాస్‌పోర్టును ట్యాంపరింగ్ చేయడం నేరమని, అందుకే అతడిని అరెస్ట్ చేశామని పోలీసులు వెల్లడించారు.