గుజరాత్లోని డాంగ్ జిల్లాలోని సపుతారా సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు శనివారం రాత్రి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. 50 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. మాలేగావ్ సమీపంలో బస్సు టైరు పేలిపోవడంతో ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. మృతుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. క్షతగాత్రులకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.