ఆస్తి విషయంలో తలెత్తిన విభేదాలతో ఓ వ్యక్తి తన తల్లిని హత్య చేశాడు. ఈ ఘటన ముంబయి సబర్బన్ ములుంద్ ప్రాంతంలోని వర్ధమాన్ నగర్‌లో శనివారం జరిగింది. జయేష్ పంచల్ (21) అనే వ్యక్తి తన తల్లిని కత్తితో గొంతు కోసి చంపాడు. ఆ తర్వాత లెటర్ రాసి ఆత్మహత్యాయత్నం చేశాడు. పోలీసులు అప్రమత్తమై రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. అతడిని ప్రాణాలతో పట్టుకుని, అరెస్ట్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa