దేశంలో కోవిడ్ ఉధృతి కొనసాగుతోంది. కొత్తగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. తాజాగా గత 24 గంటల వ్యవధిలో 18,257 కోవిడ్ పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. మహమ్మారి బారిన పడిన 42 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే 14,553 మంది కోవిడ్ నుంచి కోలుకోవడం ఊరటనిస్తోంది. డైలీ పాజిటివిటీ రేటు 4.22 శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడించాయి.