చంద్రగిరి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో తాత్కాలిక పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న తేజ శనివారం సాయంత్రం గుండెపోటుతో మృతి చెందారు. ఆయన మృతికి సబ్ రిజిస్ట్రార్లు మోహన్ బాబు, ప్రవీణ్ కుమార్, లక్ష్మీదేవి, కార్యాలయ ఉద్యోగులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన భౌతికకాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.