చిత్తూరు ప్రభుత్వ ఐటిఐ కళాశాలలో సోమవారం ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిస్ మేళాను నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ రవీంద్రారెడ్డి తెలిపారు. జిల్లాలోని ప్రముఖ కంపెనీలు ఖాళీలను భర్తీ చేయడానికి ఈ మేళాను నిర్వహిస్తున్నాయని పేర్కొన్నారు. ఉదయం 9 గంటల నుంచి జరిగే ఈ మేళాకు ఐటిఐ లో ఏ ట్రేడ్లోనైనా ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరవ్వాలని కోరారు. ఇతర వివరాలకు 9885195908 ను సంప్రదించాలని కోరారు.