జపాన్ మాజీ పీఎం షింజో అబెను హత్య చేసిన హంతకుడు యమగామీ(41) అసలు లక్ష్యం ఓ మత సంస్థ నాయకుడట. ఈ విషయాన్నీ పోలీసుల విచారణలో యమగామీ అంగీకరించినట్లు జపాన్ మీడియా వెల్లడించింది. మత సంస్థను యమగామీ తల్లి ఆరాధించేవారు. ఇది అతడికి ఎంతమాత్రం నచ్చేదికాదు. ఆ సంస్థపై అంతులేని ద్వేషం పెంచుకున్నాడు. మత సంస్థతో షింజోకు బలమైన సంబంధాలు ఉన్నాయని నమ్మేవాడు. చివరకు అతడి కోపమంతా షింజోపైకి మళ్ళి హత్యకు కారణమైంది.