నర్సరావుపేట: తొలి ఏకాదశి పర్వదినానికి కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామి ఆలయం ముస్తాబయింది. వేలాదిగా తరలివచ్చే భక్తుల కోసం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు.
ఆదివారం తెల్లవారుజామున 4 గం.కు స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేశారు. అనంతరం భక్తులను స్వామి దర్శనానికి అనుమతించారు. భక్తుల రద్దీ దృష్ట్యా మూలవిరాట్ కి అభిషేకాలను రద్దు చేశారు. అభిషేకం మండపంలో వాటిని నిర్వహిస్తున్నారు.