గుంటూరు: జిల్లాలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయని జిల్లా వైద్య అధికారులు వెల్లడించారు. శనివారం మరో 58 మందికి వైరస్ నిర్ధారణ అయినట్లు తెలిపారు.
తాజాగా గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో 35, మంగళగిరిలో రూరల్ 5, మంగళగిరి అర్బన్ 5, మేడికొండూరు 1, పెద్దకాకాని 3, తాడేపల్లి అర్బన్ 2, తాడికొండ 1, తుళ్లూరు1, వట్టి చెరుకూరు1, తెనాలి అర్బన్3, తెనాలి రూరల్ 1 చొప్పున వైరస్ బారిన పడ్డారు.