మంగళగిరి: కొప్పరావు కాలనీకి చెందిన చిరు వ్యాపారి కౌతరపు వీరాంజమ్మ గత కొన్ని సంవత్సరాలుగా కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు.
కాగా తనకు సొంత తోపుడు బండిని అందజేయాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కి అర్జీ రూపంలో విన్నవించుకోగా శనివారం సాయంత్రం మంగళగిరిలోని తెదేపా కార్యాలయంలో కౌతరపు వీరాంజమ్మ కు స్థానిక నాయకుల చేతుల మీదుగా లోకేష్ అందజేయించారు.