భట్టిప్రోలు: రాష్ట్రంలో పదివేల పాఠశాలల మూతతో విద్యారంగం కుదేలై, పిల్లలు రోడ్డు పాలయ్యారని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి తూనుగుంట్ల సాయిబాబా ఆదివారం తీవ్రంగా విమర్శించారు.
స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికలకు ముందు మెగా డీఎస్సీ పేరుతో వేలాది ఉద్యోగాలు కల్పిస్తానని వాగ్దానం చేసిన నాటి ప్రతిపక్ష నేత, నేటి సీఎం జగన్మోహన్ రెడ్డి వాగ్దానం ఏమైందని సాయిబాబా ప్రశ్నించారు.