మంత్రాలయం: తుంగభద్ర నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రాలయం తహశీల్దార్ చంద్రశేఖర్ ఆదివారం హెచ్చరించారు. కర్నాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు తుంగభద్ర డ్యాంకు వరద నీరు వచ్చి చేరుతుండడంతో డ్యాం నీటిమట్టం ప్రమాద స్థాయికి చేరిందన్నారు.
డ్యాం నీటి పరిమాణం 105 టీఎంసీల కాగా ఇప్పటికే 80 టీఎంసీలకు చేరిందని, పరిస్థితి ఇలాగే కొనసాగితే ఏ క్షణంలోనైనా డ్యాం నుంచి తుంగభద్రా నదికి వరద నీరు వదిలే ప్రమాదముందన్నారు.