టీడీపీ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్‌కు ఏపీ సర్కారు షాక్ ఇచ్చింది. ఆయనకు కల్పించిన భద్రతను తొలగిస్తూ సోమవారం నిర్ణయం తీసుకుంది. గన్‌మెన్‌లను వెనక్కి రావాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఆయనకు 1+1 సెక్యూరిటీ కల్పిస్తున్నారు. తనకు భద్రత పెంచాలని ప్రభుత్వానికి పయ్యావుల కేశవ్ ఇటీవలే దరఖాస్తు చేసుకున్నారు. ఈ తరుణంలో ప్రస్తుతం ఉన్న సిబ్బందిని వెనక్కి రావాలని ఆదేశించడం చర్చనీయాంశమైంది.