పల్నాడు జిల్లా, వినుకొండ అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వినుకొండ కొండపై వేంచేసిన శ్రీ రామలింగేశ్వర స్వామి వారి తిరునాళ్ళ సందర్బంగా ఏర్పాటు చేసిన బందోబస్తును స్థానిక వినుకొండ ఎమ్మెల్యే శ్రీ బొల్లా.బ్రహ్మ నాయుడు గారితో కలసి ఎస్పీ శ్రీ రవిశంకర్ రెడ్డి ఐపీఎస్ పరిశీలించి,పర్యవేక్షించినారు. హిందువులకు పర్వదినమైన తొలి ఏకాదశి, ముస్లింల పర్వదినమైన బక్రీద్ అదే విధంగా క్రైస్తవుల పర్వదినమైన ఆదివారం ఒకే రోజు రావడం యాదృచ్చికము. ప్రజలందరూ శాంతియుత వాతావరణములో తమ ఇష్టదైవాలను ఆరాధించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని ఆదివారం మీడియా సమావేశం ద్వారా తెలియజేసారు.