వైసీపీ ప్లీనరీ కోసం రాష్ట్ర అధికార యంత్రాంగాన్ని సీఎం జగన్ రెడ్డి దుర్వినియోగం చేశారని పల్నాడు జిల్లా. నరసరావుపేట టీడీపీ ఇంచార్జి చదలవాడ అరవింద్ బాబు ఆరోపించారు. నరసరావుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ....... వైసీపీ ప్లీనరీ కోసం ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో పాటు మొత్తం ప్రభుత్వ యంత్రాంగం పనిచేయడం దారుణం. ఇందుకోసం ఆర్టీసీ నుంచి 1800 బస్సులు తీసుకోవడం, ఏమాత్రం డిపాజిట్లు చెల్లించకపోవడం ప్రజలు గమనిస్తున్నారు. రాబోయే ఎన్నికలలో తగిన బుద్ధి చెప్తారు అని తెలియజేసారు.