తాడికొండ: రుతుపవన ద్రోణి, అల్పపీడన ప్రభావాలతో సోమ, మంగళవారాల్లో ఉత్తర కోస్తాలో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు స్టెల్లా సోమవారం తెలిపారు.
అనేకచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు కురవొచ్చని పేర్కొన్నారు. దక్షిణ కోస్తా, రాయలసీమల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడొచ్చన్నారు.