జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం చాతుర్మాస్య దీక్షను చేపట్టారు. ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు నాలుగు నెలల పాటు కఠిన నియమాలతో కూడిన దీక్షలు చేస్తారు.
హైందవ సంప్రదాయంలో కనకదుర్గమ్మ అనుగ్రహం కోసం ఈ దీక్షలను చేస్తుంటారు. సూర్యోదయానికి ముందు స్నానం చేయడం, బ్రహ్మచర్యం, శాకాహారంతో ఒంటిపూట భోజనం, నేలపై నిద్రించడం, అహింస పాటించడంతో పాటు ఉపనిషత్ పఠనం వంటివి ఈ దీక్షలో నియమాలు.