హైడ్రామా మధ్య చెన్నైలో సోమవారం నిర్వహించిన అన్నాడీఎంకే కార్యవర్గ సమావేశంలో పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా మాజీ సీఎం పళనిస్వామి ఎన్నికయ్యారు. సమావేశాన్ని వ్యతిరేకిస్తూ పన్నీరుసెల్వం వేసిన పిటిషన్న మద్రాస్ హైకోర్టు కొట్టి వేసింది. దీంతో పళనిస్వామి ఎన్నికకు మార్గం సుగమం అయింది. ఇక పార్టీ సమావేశంలో జయలలితకు భారతరత్న ఇవ్వాలని, పార్టీ పదవులకు 4 నెలల్లో ఎన్నికలు పెట్టాలని తీర్మానించారు.