ఈదురు గాలుల ధాటికి పర్యాటక ప్రాంతమైన నాగార్జునకొండకు వెళ్లే లాంచీలను అధికారులు ఆదివారం లాంచి స్టేషన్ లోనే నిలిపివేశారు. నాగార్జునసాగర్ కు భారీగా చేరుకున్న పర్యాటకులు కొండకు లాంచీలు నిలిపివేయడంతో నిరాశతో వెనుదిరి గారు. రెండు రోజులుగా నాగార్జున సాగర్ జలాశయం వెంబడిఈదురు గాలులు తీవ్రంగా వీస్తున్నాయి. నేపథ్యంలోనే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా లాంచీలను నిలిపివేశారు