బడి పిల్లల ఆరోగ్యం పై పాఠశాల విద్యా శాఖ, ఆరోగ్యశాఖ దృష్టి సారిస్తున్నాయి. కోవిడ్ -19 తో పాఠశాలల్లో విద్యార్థులకు ఆరోగ్య పరిక్షలు నిలిచిపోయాయి. దీంతో పల్నాడు జిల్లాలోని ప్రభుత్వ, యాజమాన్య పాఠశాలల్లో చదువుతున్నార 2. 12 లక్షల మంది విద్యార్థులకు సోమవారం నుంచి ఆరోగ్య కార్యకర్తలు ప్రాధమిక ఆరోగ్య పరిక్షలు నిర్వహించాలని వైద్య శాఖ రాష్ట్ర కమిషనర్ నిర్ణయం తీసుకున్నారు.