గుంటూరు, వట్టిచెరుకూరు: స్థానిక రైతు భరోసా కేంద్రానికి ఇంటి యజమాని తాళం వేశారు. 15 నెలల నుంచి అద్దె చెల్లించకపోవడంతో విసుగెత్తిన ఇంటి యాజమాని కేంద్రానికి తాళం వేశారు. తాను వైసీపీ కార్యకర్తనని ప్రభుత్వంపై నమ్మకంతో ఇల్లు అద్దెకి ఇచ్చినట్లు చెప్తున్నాడు. తన అద్దె చెల్లించాలని నెలలు తరబడి అడుగుతున్నా కనీసం వ్యవసాయ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని చేసేదేమీ లేక తాళం వేసినట్లు యాజమాని చెప్తున్నారు.