చాలా మందికి అధికంగా చెమటపడుతుంటుంది. ఆ సమయంలో శరీరం నుంచి దుర్వాసన కూడా ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఆందోళన, మానసిక ఒత్తిడి, కారంగా ఉండే ఆహారాలు అధికంగా తినడం వల్ల ఎక్కువ మందికి అధిక చెమట పడుతుంటుంది. చల్లని బ్లాక్ టీలో ముంచిన మెత్తని గుడ్డతో చెమట ఎక్కువగా పట్టేచోట తుడుచుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అధిక కారాలు ఉండే ఆహారాలు, వేడివేడి ఆహార పదార్థాలను తినడం మానుకోండి.