పల్నాడు జిల్లా, నరసరావుపేట నియోజక వర్గ పరిధి, రొంపిచర్ల మండలంలోని అన్నవరప్పాడు గ్రామంలో ఆదివారం రాత్రి బాదుడే బాదుడు కార్యక్రమం స్థానిక టీడీపీ ఇంచార్జి చదలవాడ అరవింద్ బాబు , నాయకులు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొని గడపగడపకు వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తోలత ఎస్సీ కాలనీలో ఇంటింటికి తిరిగి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించారు. వైసీపీ ప్రభుత్వానికి తగిన సమయంలో బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నాం అని తెలియజేసినట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa