చిత్తూరు: వెదురుకుప్పం మండలంలో జనసేన పార్టీ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని ఆదివారం నియోజకవర్గ ఇన్చార్జ్ పొన్న యుగంధర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా యుగంధర్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో అరాచకాలు, దౌర్జన్యాలు ఎక్కువగా ఉన్నాయని, వీటన్నిటిని అరికట్టేందుకు రానున్న ఎలక్షన్ లో తమ నాయకులు పవన్ కళ్యాణ్ సీఎంగా అవుతారని ధీమా వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు.