వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా వై.ఎస్.జగన్ అన్నట్లుగా వైసీపీ ప్లీనరీలో చేసిన తీర్మానం 1951లోని సెక్షన్-29ఏ ప్రకారం చెల్లదని, ఓట్ల ప్రక్రియ ద్వారానే అధ్యక్షుడు సహా మొత్తం కార్యవర్గాన్ని ఎన్నుకోవాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. వైఎస్సార్‌సీపీ జీవితకాల అధ్యక్షుడిగా వైఎస్ జగన్ నియామకం చట్ట విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. . వైఎస్సార్‌సీపీ ప్లీనరీలో జగన్‌ను ఆ పార్టీ జీవితకాల అధ్యక్షుడిగా తీర్మానిస్తూ పార్టీ నిబంధనావళిని మార్చడాన్ని తప్పుబట్టారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్-29ఏ ప్రకారం ఈ తీర్మానం చెల్లదని.. కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు ఉన్న ఏ రాజకీయ పార్టీలో అయినా అంతర్గత ప్రజాస్వామ్యం ఉండాలని వ్యాఖ్యానించారు. ఓట్ల ప్రక్రియ ద్వారానే అధ్యక్షుడు సహా మొత్తం కార్యవర్గాన్ని ఎన్నుకోవాలని.. నిబంధనలు కూడా ఇవే చెబుతున్నాయని చెప్పుకొచ్చారు. రెండు, మూడేళ్లకు ఒకసారి ఎన్నికలు నిర్వహించాలన్న విషయాన్ని గుర్తు చేశారు.
గతంలో కాంగ్రెస్ ఇలా వ్యవహరించకపోవడంతో ఎన్నికల సంఘం నోటీసులిచ్చిందన్నారు నారాయణ. ఇలాగే పార్టీ రూల్స్ మార్చడంతో ఈసీ నోటీసులు పంపిందన్నారు. వైఎస్సార్‌సీపీ జగన్‌ను శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకోవటంపై ఈసీ ఎలా స్పందిస్తుందో చూడాలి అన్నారు. ఇదిలా ఉంటే.. తమిళనాడులోని డీఎంకేలానే జగన్‌ని శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకున్నట్లు చర్చ జరుగుతోంది. కరుణానిధిని డీఎంకే పార్టీ లైఫ్ టైమ్ ప్రెసిడెంట్‌గా తీర్మానించటాన్ని ఈసీ ఆమోదించిందట.. కరుణానిధి అధ్యక్షుడిగా కొనసాగారు. ఆ తర్వాత ఆయన కుమారు ఎంకే స్టాలిన్ పార్టీ పగ్గాలు చేపట్టారు. ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మొత్తం మీద ప్లీనరీలో వైఎస్సార్‌సీపీ తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశమైంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa