ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శ్రీశైల జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది, మంగళవారం ఉదయం నాటికి ఇన్ ఫ్లో 10, 000 క్యూసెక్కులు కాగా ఔట్ ఫ్లో నిల్ గా ఉంది.
పూర్తి స్దాయి నీటి మట్టం 885. 00 అడుగులు కాగా ప్రస్తుతం 824. 50 అడుగులు గా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215. 8070 టీఎంసీలు కాగా 44. 3482 టీఎంసీలు గా నమోదైంది. కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి ఇంకా ప్రారంభించలేదు.