చంద్రబాబు మోసపూరిత మాటలు జనం నమ్మరని, వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని 175 సీట్లు గెలుస్తామని మంత్రి మేరుగ నాగార్జున ధీమా వ్యక్తం చేశారు. వైయస్ఆర్సీపీ ప్లీనరీ చూశాక చంద్రబాబు పరిస్థితి అగమ్య గోచరంగా వుందన్నారు. వర్షం పడినా ప్రజలు లెక్కచేయకుండా ఉవ్వెత్తున ఎగసిన కెరటాల్లా ప్లీనరీకి వచ్చారని తెలిపారు. ఎలాంటి అవరోధాలు వున్నా జనం ఉత్సాహంగా ప్లీనరీకి వచ్చారని చెప్పారు. చంద్రబాబుకు కుప్పం సీటు కూడా చేజారీపోతుందేమో అన్న అనుమానం వచ్చిందని అన్నారు. సీఎం వైయస్ జగన్ ను కాపాడుకోవాలన్న ఉద్దేశంతో అన్ని వర్గాలు వున్నాయని చెప్పారు.