రాష్ట్రంలో ఎడతెరిపిలేని వర్షాలు, వరద పరిస్థితిపై ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. శ్రీకాకుళం నుంచి ఏలూరు జిల్లా వరకు కలెక్టర్లతో సీఎం వైయస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గోదావరి ఉధృతి, వరద సహాయక చర్యలపై సీఎం వైయస్ జగన్ దిశానిర్దేశం చేస్తున్నారు. జిల్లా స్థాయిలో ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండి , ఎటువంటి అవాంఛనీయమైన ఘటనలు జరగకుండా చూసుకోవాలని తెలియజేసారు. గ్రామా స్థాయిలో సచివాలయ సిబ్బంది దీని మీద శ్రద్ధ పెట్టి ప్రజలని అప్రమత్తం చెయ్యాలని కోరారు.