ఏపీలోని తిరుపతి జిల్లాలో దారుణం జరిగింది. వడమాలపేట మండలం బట్టికండ్రిగకు చెందిన రమేష్‌కు, ఆయన భార్యకు గొడవలు జరుగుతున్నాయి. ఆమెపై అనుమానం, కోపంతో కుమారుడు మహేష్ (8)కు సోమవారం రాత్రి బలవంతంగా ఫినాయిల్ తాగించాడు.
బాలుడి అమ్మమ్మ సకాలంలో ఆసుపత్రికి తీసుకెళ్లడంతో ముప్పు తప్పింది. అయినా కోపం తగ్గక కొడుకుపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. ప్రస్తుతం ఆ బాలుడు రుయాలో చికిత్స పొందుతున్నాడు.