ఉత్తరప్రదేశ్‌లోని జోధ్‌పుర్ లో సీఆర్పీఎఫ్ క్యార్టర్స్‌లో ఉంటున్న జవాన్ నరేశ్ ఆదివారం సెలవు కావాలని అడగగా అధికారులు ఇవ్వలేదు. దీంతో నరేశ్ కోపంతో మరో జవాన్ చేయి కొరికాడు. అనంతరం నరేశ్ తన బాల్కనీలో గన్‌తో కాల్పులు జరిపి ఇంట్లోకెళ్ళి తాళం వేసుకొని భార్య, కూతురుతో కలిసి 18గంటలు బందీలా గడిపాడు. అధికారులు నరేశ్‌తో ఫోన్లో మాట్లాడినా శాంతించలేదు. సోమవారం గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.