ఉక్రెయిన్ విషయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉక్రెయిన్ ప్రజలకు రష్యా పౌరసత్వం వేగంగా ఇస్తే ఫైలుపై సోమవారం సంతకం చేశారు. ఇప్పటి వరకు ఉక్రెయిన్లోని ఖేర్సన్, జపొరిజ్జియా వంటి కొన్ని ప్రాంతాలకే ఈ విధానాన్ని అమలు చేశారు. అయితే తాజా విధానంతో ఉక్రెయిన్ అంతటా పౌరసత్వం వర్తింపజేయనున్నారు. అయితే రష్యా నిర్ణయంపై ఉక్రెయిన్ ప్రభుత్వం ఇంకా స్పందించలేదు.