చిలీ రాజధాని శాంటియాగోలో ఆశ్చర్యకర ఘటన చోటుచేసుకుంది. అంతరిక్షంలో నుంచి ఓ ఉల్క భూమిపై పడుతూ భగ్గున మండి ముక్కలైపోయింది. జూలై 7న ఉదయం 5.44 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఉల్క పేలిపోయినప్పుడు ఏదో పెద్ద మెరుపు మెరిసినట్లు చప్పుడు వచ్చిందని స్థానికులు చెప్తున్నారు. 'టీ12.సీఎల్' అనే ఉల్క శాంటియాగో ఆకాశంలో ఇలా పేలిపోయినట్లు చిలీయన్ ఆస్ట్రోనమీ ఫౌండేషన్‌కు చెందిన వ్యోమగామి జువాన్ కార్లోస్ బీమిన్ తెలిపారు.