గుజరాత్ పోలీసు ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ చేసి పోలీసులకు షాక్ ఇచ్చారు హ్యాకర్లు. ఆ ట్విట్టర్ అకౌంట్ పేరును ఎలన్ మస్క్‌గా మార్చారు. అంతేకాదు, డీపీ కూడా మార్చేశారు. ఓ స్పేస్ షిప్ ఫొటోను డీపీగా పెట్టారు. ఈ విషయంపై గుజరాత్ హోం శాఖ మంత్రి హర్ష సంఘవి స్పందిస్తూ గుజరాత్ పోలీసుల అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ హ్యాక్‌కు గురైందని తెలిపారు. అయితే, ప్రస్తుతం ఆ ట్విట్టర్ అకౌంట్ మళ్లీ మనుగడలోకి వచ్చినట్టు సమాచారం.