ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజలకి మనమున్నాం అనే భరోసా కలిగించండి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 12, 2022, 01:28 PM

సమస్యలతో వచ్చిన బాధితులకు సత్వర న్యాయం అందించే లక్ష్యంతో నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమాన్ని ప్రతి ఒక్క అధికారి బాధ్యతగా స్వీకరించి, సమస్యతో వచ్చిన వారికి చిరునవ్వుతో స్వాగతం పలికి వారి సమస్యను సావధానంగా విని, మీకు మేమున్నామని భరోసా కల్పించాలని కృష్ణాజిల్లా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ శ్రీ ఎన్ వెంకట రామాంజనేయులు గారు అన్నారు. సోమవారం జరిగిన  స్పందన కార్యక్రమంలో భాగంగా ఈరోజు అడిషనల్ ఎస్పీ గారు జిల్లా ఎస్పీ పి జాషువా ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ కార్యాలయం లో ప్రజల నుండి అర్జీలు స్వీకరించి, సమస్య ఆధారితంగా సంబంధిత పోలీసు అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలు జారీ చేసి చట్టపరిధిలో సత్వర పరిష్కారం చూపాలని తెలిపారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com