భీమవరంలోని కలెక్టరేట్లో సోమవారం జరిగిన స్పందన కార్యక్రమానికి టీడీపీ నాయకులూ మంతెన రామరాజు హాజరై 3 లక్షల పైబడి ధాన్యం బకాయిలను రైతులకు వెంటనే చెల్లించాలని మరియు నియోజకవర్గంలోని డ్రైనేజీ వ్యవస్థలు అస్తవ్యస్తంగా ఉండి రైతుల పాలిట శాపంగా మారాయని తెలియజేసారు. ప్రజల సొమ్ముని ప్రజలకి త్వరగా చెల్లించి రైతులని ఆదుకోవలసిందిగా తెలియజేసారు. ఇప్పటికే ప్రజలు ఎన్నో అప్పులతో బాధపడుతున్నామని ధాన్యం సొమ్ము వస్తే కొంత మేరకు అప్పులు తీర్చుకోవడానికి వీలుగా ఉంటుందని రైతులు తమ వద్ద గోడు వినిపించారని , కాబట్టి మీరు దీనిని దృష్టిలో పెట్టుకొని రైతులకి న్యాయం చెయ్యాలని కోరారు. నియోజకవర్గ పరిధిలోని రైతులు, రైతు నాయకులు మరియు పార్టీ నాయకులతో కలసి వెళ్లి వినతి పత్రం అందజశాను.