అమర్నాథ్ యాత్రలో గల్లంతైన వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇద్దరు ఏపీవాసులు మృత్యువాత పడటంతో మిగతా భక్తుల కోసం చర్యలు చేపట్టింది ప్రభుత్వం. ఏపీకి చెందిన చాలామందిని సహాయక బృందాలు కాపాడి, సురక్షిత ప్రాంతాలకు చేర్చారు. మరోవైపు ఏపీ నుంచి యాత్రకు వెళ్లేముందు భక్తులు ఇచ్చిన చిరునామాలు, ఫోన్ నెంబర్ల ఆధారంగా ఇళ్లకు వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. 1902 టోల్‌ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేశారు.