కోనసీమ జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. సోమవారం కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం యలకల్లంకకు చెందిన 15 మంది పాడి రైతులు లంకలో ఉండే పశువులను వడ్డుకు తీసుకువచ్చేందుకు ఇంజెక్షన్ పడవపై వెళ్ళారు. పశువులను తీసుకువస్తుండగా నది మధ్యలోనే పడవ ఆగిపోయింది. దాంతో గోదావరి ఉధృతికి సుమారు 7 కిలోమీటర్లు వరకు పడవతో పాటు రైతులు కొట్టుకుపోయారు. అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఇంజన్ బోట్ల సాయంతో రైతులను కాపాడారు.