తిరుమలలో సెప్టెంబర్ 27న నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలను నిర్వహించాలని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన పాలకమండలి నిర్ణయించింది. కొవిడ్ తగ్గుముఖం పట్టడంతో బ్రహ్మోత్సవ వేడుకలను మాడవీధుల్లో జరపడానికి టీటీడీ పాలక మండలి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. సెప్టెంబరు 27 నుంచి అక్టోబరు 5 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.