కూరగాయల ధరలు లంకలో భగ్గుమంటున్నాయి. కొలంబోలోని పేటలోని ఫెడరేషన్ ఆఫ్ సెల్ఫ్ ఎంప్లాయీస్ మార్కెట్ లో కిలో టమోటా శ్రీలంక రూపాయల్లో 150కి అమ్ముడవుతోంది. కిలో ఉల్లి 200కు విక్రయిస్తుండగా, కిలో బంగాళదుంపలు 220కి విక్రయిస్తున్నారు. కిలో క్యారెట్ రూ.490కి, పావుకిలో వెల్లుల్లి రూ.160కి విక్రయిస్తున్నారు. సరఫరా కొరతతోపాటు, రవాణా ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారిపోయిందని కూరగాయల విక్రయదారులు వాపోతున్నారు.